: పెళ్లాడమందని ప్రియురాలిని చంపేశాడు
'ఎన్నాళ్లిలా ప్రేమించుకుంటాం, ఇక పెళ్లి చేసుకుందాం' అని ఒత్తిడి తెచ్చినందుకు ప్రియురాలిని చంపేశాడో వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మల్లయ్యపేటలో వరలక్ష్మి (19) అనే యువతిని గొంతునులిమి హత్యచేశాడు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు.