: మన వాళ్లు స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారట!


భారతీయ యువత స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారని ఓ సర్వే వెల్లడించింది. గాడ్జెట్ల వినియోగంతో పాటు, భారతీయ పర్యాటకుల గురించి తెలుసుకునేందుకు ఎక్స్ పీడియా అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. కేవలం భారత్ మాత్రమే కాకుండా, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు, యూరప్, ఆసియా ఫసిఫిక్ దేశాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. అందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈమధ్య కాలంలో భారతీయులు ఆన్ లైన్ బుకింగ్స్ కు, వివిధ గాడ్జెట్లకు బాగా అలవాటుపడిపోయారని ఆ సర్వే తెలిపింది. హోటల్ బుకింగ్, టికెట్ బుకింగ్, గాడ్జెట్ల కొనుగోలు వంటి విషయాలకు భారతీయులు ఎక్కువగా ఆన్ లైన్ పై ఆధారపడుతున్నారని సర్వే చెప్పింది. 95 శాతం మంది భారతీయుల జీవితాల్లో స్మార్ట్ ఫోన్ లు అత్యంత కీలకమైనవిగా మారిపోయాయని సర్వే వివరించింది. 75 శాతం మంది భారతీయులు హోటల్ బుకింగ్ లు ఆన్ లైన్ ద్వారా చేస్తున్నారని సర్వే వెల్లడించింది. 68 శాతం మంది భారతీయులు విదేశీ పర్యటనల్లో తమ మొబైల్ కు ఇంటర్నేషనల్ డేటా ప్లానింగ్, రోమింగ్ ప్లాన్ వాడతామని చెప్పారని సర్వే వివరించింది.

  • Loading...

More Telugu News