: మైక్రోఫోన్లు విసురుకున్న ఏఐఏడీఎంకే, డీఎంకే కౌన్సిలర్లు
తమిళనాడులోని కరూర్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం ఈ రోజు ఆశ్చర్యకర సన్నివేశాలకు వేదికైంది. ఈ మధ్యాహ్నం కౌన్సిలర్ల సమావేశానికి డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే, కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటో ఉండంటపై డీఎంకే కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలో లేని ఆమె ఫోటో ఎందుకు ఉంచారని, తక్షణమే తీసి వేయాలని డిమాండు చేశారు. ఈ క్రమంలో కొంతమంది అత్యుత్సాహపరులైన ఏఐఏడీఎంకే కార్యకర్తలు డీఎంకే డిమాండుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దాంతో, ఇరు పార్టీల కౌన్సిలర్లు అక్కడున్న మైక్రోఫోన్లు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. జరగాల్సిన సమావేశం కాస్తా రసాబాసగా మారింది.