: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు వింత అనుభవం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు వింత అనుభవం ఎదురైంది. కరీంనగర్ లో స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది బోయినపల్లి వెంకటరామారావు అంత్యక్రియలకు వీరు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ వద్దకు వచ్చేసరికి అక్కడ పైలట్ లేడు. అతని కోసం సీఎం కేసీఆర్ సుమారు 20 నిమిషాలు వేచి చూశారు. సీఎం భద్రతాధికారులు నానా హైరానా పడి అతని మొబైల్ నెంబర్ సంపాదించి, ఫోన్ చేస్తే ఆయన అల్పాహారానికి వెళ్లినట్టు తెలిసింది. సీఎం తనకోసం వేచిచూస్తుండడంతో... ఆయన హడావుడిగా అల్పాహారం ముగించి, హెలికాప్టర్ చేరుకుని సీఎం, మంత్రులను హైదరాబాదు తీసుకెళ్లారు.