: ధూమపానంలో అగ్రదేశాలతో పోటీ పడుతున్న భారత మహిళలు


ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య, ఆరోగ్య శాఖలు నెత్తీనోరుబాదుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. అయినప్పటికీ ధూమపానం ఆగడం లేదు సరికదా, రోజురోజుకీ పెరిగిపోతోంది. దీని తీవ్రత గమనించిన కేంద్రం సిగరెట్, బీడీ పెట్టెలపై పుర్రెబొమ్మ ముద్రించడం వంటి హెచ్చరికలు అమలయ్యేలా నిబంధనలు తెచ్చింది. దానితో ఊరుకోకుండా అమాంతం ధరలు పెంచేసి, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం శిక్షార్హమని కూడా ప్రకటించింది. అయినప్పటికీ, ధూమపానంలో భారతీయ మహిళలు అగ్రదేశాలతో పోటీ పడుతున్నారు. ఎంతెలా అంటే, అత్యధిక జనాభా కలిగిన చైనాను వెనక్కి నెట్టిన భారత వనితలు అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో నిలిచారు. గత మూడు దశాబ్ధాల్లో మన దేశంలోని మహిళలల్లో ధూమపానం రెండింతలు పెరిగిందని ఓ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి 1.27 కోట్ల మంది మహిళలు ధూమపానం చేస్తున్నారని తెలిపింది. ధూమపాన నివారణ చర్యలతో ఫ్రాన్స్, రష్యా దేశాలు మహిళల్లో ఆ అలవాటును మాన్పించగలిగాయని ఆ సంస్థ వివరించింది. ధూమపానం కారణంగా ప్రతి ఏటా సుమారు పది లక్షల మంది మృతి చెందుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

  • Loading...

More Telugu News