: ఢిల్లీ రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు: షీలా దీక్షిత్
ఢిల్లీ రాజకీయాలపై తనకెలాంటి ఆసక్తి లేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. దాంతో తనకు తానుగా దేశ రాజధాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తేల్చేశారు. ఇక తాజా ఎన్నికలపై మాట్లాడుతూ, ఎన్నికలు వస్తే కాంగ్రెస్ తప్పకుండా పోటీ చేస్తుందని, తప్పకుండా బాగానే పోటీ ఇస్తుందని షీలా చెప్పారు. ఇదే సమయంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ చూస్తోందన్న వార్తలపై ఆమె స్పందిస్తూ, బీజేపీకి సరైన బలం లేనందున ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు.