: విద్యుత్ సమస్యను పరిష్కరిస్తాం: కిషన్ రెడ్డి
విద్యుత్ సంక్షోభాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని అన్నారు. విద్యుత్ సమస్య తీవ్రత తెలిపేందుకు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తామని ఆయన రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపి, మేలు జరిగేలా చూడడమే బీజేపీ లక్ష్యమని చెప్పిన ఆయన, రాష్ట్రాభివృద్ధికి తమ పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.