: 'కత్తి' హీరో విజయ్ పై పరువునష్టం దావా


దీపావళికి విడుదలైన తమిళ చిత్రం 'కత్తి'తో విజయ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ సినిమాలో ఓ డైలాగ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ హీరో విజయ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పై మధురై మేజిస్ట్రేట్ కోర్టులో ఆర్.సుబ్రమణియన్ అనే న్యాయవాది పరువు నష్టం దావా వేశారు. ఆ సినిమాలో 2జీ కుంభకోణాన్ని స్పృశిస్తూ ఓ డైలాగ్ ఉందని, అది జాతి ప్రయోజనాలకు, న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని సుబ్రమణియన్ అన్నారు. "కేవలం తరంగాల (2జీ) సాయంతో కోట్లకు కోట్లు లూటీ చేసిన వ్యక్తులు ఉన్న దేశమిది" అంటూ విజయ్ పలికిన డైలాగే అభ్యంతరానికి కారణమైంది.

  • Loading...

More Telugu News