: డబ్బిచ్చేసి చేతులు దులుపుకుంటే దానం అనిపించుకోదు: కార్పొరేట్ సంస్థలకు గవర్నర్ హితవు
కొంత ధనాన్ని సామాజిక బాధ్యతగా విదిల్చే పధ్ధతి నుంచి కార్పొరేట్ సంస్థలు బయటకు రావాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. 'సోషల్ రెస్పాన్సిబిలిటీ' పేరిట రామకృష్ణా మిషన్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలు, వ్యాపారులు సామాజిక బాధ్యతగా కొంత డబ్బిచ్చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. ఈ పధ్ధతి సరికాదని ఆయన హితవు పలికారు. కార్పొరేట్ సంస్థలన్నీ తాము వెచ్చిస్తున్న మొత్తాన్ని ఓ చోట చేర్చి ఆ సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. ఓ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా దత్తత తీసుకుని విద్య, వైద్య కార్యక్రమాలు చేపట్టాలని ఆయన చెప్పారు. రామకృష్ణ మిషన్, సత్యసాయి సేవా సమితి వంటి సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలను కంపెనీలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు.