: ఏపీలో పెరిగిన రెవెన్యూ వసూళ్లు
ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ వసూళ్లు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే సెకండ్ క్వార్టర్ లో రాష్ట్ర ఆదాయం పెరిగిందని అధికారులు వివరించారు. ఈ మేరకు వివరాలతో కూడిన నివేదికను బాబుకు అందించారు. సచివాలయంలో రెవెన్యూ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలోనే రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు, వ్యయం తదితర అంశాలపై చర్చించారు.