: సరదాకి ఏనుగుతో ఫోటో దిగితే... తొక్కి చంపేసింది!


విహారం విషాదాంతమైంది. దీపావళిని పురస్కరించుకుని గుజరాత్ నర్మదా జిల్లాకు చెందిన ఓ పర్యాటక బృందం కేరళలో పర్యటించేందుకు వచ్చింది. పలు ప్రాంతాలు పర్యటించిన అనంతరం ఈ బృందం ఇరుత్తుకనమ్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఏనుగు సవారీ కేంద్రానికి వెళ్లింది. పర్యటనను తీపిగుర్తుగా మలుచుకునేందుకు ఓ యువతి ఏనుగుతో ఫోటో దిగేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఏనుగు ఆమెను తొండంతో లాగి కిందపడేసి తొక్కేసింది. గజరాజు తొక్కేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News