: అక్కడ ట్రాఫిక్ పోలీసులు ప్రథమ చికిత్స కూడా చేస్తారు!


బీహార్ రాజధాని పాట్నాలో ట్రాఫిక్ పోలీసులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమైన జంక్షన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అందించారు. వాహనదారులు ప్రమాదాల్లో గాయపడినట్టయితే, ట్రాఫిక్ పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేస్తారు. తొలుత ఐదు పోస్టుల్లో ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంచుతారు. మొబైల్ పార్టీలకు కూడా ఈ బాక్సులు అందించామని ట్రాఫిక్ ఎస్పీ ప్రణ్ తోష్ కుమార్ దాస్ మీడియాకు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ భాగస్వామ్యంతో ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో కాటన్, బాండేజ్ క్లాత్, యాంటీసెప్టిక్ ఔషధాలు ఉంటాయని ఎస్పీ వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు, అంబులెన్స్ వచ్చేలోపు, లేక, క్షతగాత్రుడిని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళేలోపు జరిగే నష్టాన్ని నివారించడమే ఈ పథకం వెనకున్న ఉద్దేశమని తెలిపారు.

  • Loading...

More Telugu News