: ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ పై విచారణ వాయిదా


ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. కళాశాలలు ప్రతిపాదించిన అకాడమిక్ షెడ్యూల్ పై ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. అందులో పనిగంటలు పెంచి నష్టపోయిన పనిదినాలు పూర్తి చేస్తామని కళాశాలలు న్యాయస్థానానికి తెలిపాయి. అయితే, పనిదినాలు పెంచేందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన కోర్టు, ఏఐసీటీఈ నిబంధనలు పాటించాలని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన వల్లే కౌన్సెలింగ్ గడువు పొడిగింపునకు అనుమతించామని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలో విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News