: స్నాప్ డీల్ లో జపాన్ టెలికాం పెట్టుబడులు
దేశ ఇ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్.కామ్ లో జపాన్ కు చెందిన అతిపెద్ద టెలికాం సంస్థ సాప్ట్ బ్యాంక్ కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో, రూ.3,762 కోట్లు పెట్టుబడిగా రానున్నట్లు స్నాప్ డీల్ తెలిపింది. భారత్ కు చెందిన ఓ ఆన్ లైన్ సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం విశేషం. ఈ పెట్టుబడులను లాజిస్టిక్స్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నట్లు స్నాప్ డీల్ తెలిపింది. వచ్చే ఆరు నెలల్లో మొబైల్ టెక్నాలజీ మార్కెట్ లో అడుగు పెట్టాలని కూడా భావిస్తున్నట్లు చెప్పింది.