: ప్రభుత్వరంగ బ్యాంకుల సీఎండీల నియామకానికి కొత్త ప్రక్రియ


కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో నడుస్తున్న ఆరు బ్యాంకుల సీఎండీ (ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్)ల నియామకాలకు సంబంధించిన 'అత్యున్నత స్థాయి కమిటీ'ని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఈ కమిటీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు తాజాగా కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో, బ్యాంకుల అధికారుల ఎంపికకు మోదీ ప్రభుత్వం ఓ కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో ఛైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, అంతేగాక ప్రభుత్వరంగ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పోస్టుల ఖాళీలను సరికొత్త ఎంపిక ప్రక్రియ ద్వారానే భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. రెండు నెలల కిందట లంచం తీసుకున్న కేసులో సిండికేట్ బ్యాంక్ సీఎండీ వ్యవహారంపై దర్యాప్తు చేయడం, ఆయన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం తాజా మార్పులకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News