: ముంబైలో మొదలైన బీజేఎల్పీ భేటీ


మహారాష్ట్ర బీజేఎల్పీ భేటీ కొద్దిసేపటి క్రితం ముంబైలో ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సమావేశానికి పరిశీలకుడి హోదాలో హాజరయ్యారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిని ఈ భేటీ నిర్ణయించనుంది. సీఎం రేసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా వున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదని ప్రకటించిన గడ్కరీ... దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమం చేశారు. దాంతో ఫడ్నవీస్ నే సీఎంగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భేటీలో భాగంగా తమ ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీపై కూడా నేతలు చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News