: హర్యానాలో 125 అడుగుల సొరంగం తవ్వి బ్యాంకును దోచుకున్నారు!


హర్యానాలోని గొహనా టౌన్ షిప్ లో దొంగలు పంజాబ్ నేషనల్ బ్యాంకును దోచుకునేందుకు ఏకంగా 125 అడుగుల పొడవైన సొరంగాన్ని తవ్వారు. 2.5 అడుగుల వెడల్పున్న ఆ సొరంగం నేరుగా బ్యాంకు స్ట్రాంగ్ రూంకు దారితీసింది. దోపిడీ జరిగిన విషయాన్ని సోమవారం ఉదయం గుర్తించారు. స్ట్రాంగ్ రూంలో మొత్తం 360 లాకర్లుండగా, వాటిలో 90 లాకర్లు తెరిచి ఉన్నాయని బ్యాంకు మేనేజర్ దేవిందర్ మాలిక్ తెలిపారు. బ్యాంకు సమీపంలోని ఓ పాడుబడ్డ భవనం నుంచి ఈ సొరంగం తవ్వారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న భారీ దొంగతనాల్లో ఇదీ ఒకటని భావిస్తున్నారు. శనివారం రాత్రి ఈ దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News