: అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే తనయుడు బోండ సిద్ధార్థ


విజయవాడ నగర ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు కుమారుడు బోండ సిద్ధార్థ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గుంటూరు జిల్లా పరిధిలో కారు రేసులకు తెరతీసి ఇంజినీరింగ్ విద్యార్థి నాగేంద్ర మృతికి కారణమయ్యారని సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సిద్ధార్థ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడు ఎమ్మెల్యేకు స్వయానా కొడుకు కావడంతో పోలీసులు ఈ కేసు పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News