: నందిగామలో కాల్పులు... వ్యాపారి మృతి
కృష్ణా జిల్లా నందిగామలో మంగళవారం కాల్పులు చోటుచేసుకున్నాయి. పెట్రోల్ బంక్ వద్దకు కారులో వచ్చిన వ్యాపారి శ్రీశైలం వాసుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి జరిగిన దుండగుల కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన శ్రీశైలం వాసు, కారులోనే మృతి చెందారు. బైక్ పై వచ్చి కాల్పులకు దిగిన దుండగులు అనంతరం అదే బైక్ పై పరారయ్యారు.