: వైకాపాకు షాకిచ్చిన కొణతాల... ఫ్యాక్స్ చేసిన రాజీనామా లేఖ
వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న కొణతాల రామకృష్ణ... పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపించారు. తనను అడుగడుగునా అవమానిస్తున్నారని... తమ ఇంటి గేటు ముందు బానిసగా ఉండలేనని జగన్ కు కొణతాల ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్, తన సన్నిహితుడు గండి బాబ్జీని తప్పించడంతో కొణతాల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.