: కడపను ముంచెత్తిన వర్షం... నీట మునిగిన బద్వేలు ఆర్టీసీ గ్యారేజీ


కడప జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ నష్టాన్నే మిగిల్చాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జిల్లాలోని బద్వేలు ఆర్టీసీ డిపోలోకి భారీగా నీరు చేరిపోయింది. దీంతో డిపోలోని గ్యారేజీ నీట మునిగింది. ప్రస్తుతం బస్సుల రిపేరీ కోసం కేటాయించిన ప్రాంతంలో ఎనిమిది అడుగుల మేర నీరు చేరింది. దీంతో విలువైన సామగ్రిని వెలికి తీసేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. డిపో అధికారుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది గ్యారేజీలోని నీటిని తోడేందుకు చర్యలు చేపడుతున్నారు. గ్యారేజీలోని నీటిని పూర్తిగా తోడివేసేందుకు మరో రోజు సమయం పడుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News