: ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం ‘భారతీ’ కార్మికుల ఆందోళన


తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ భారతీ సిమెంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని సిమెంట్ కర్మాగారం ముందు మంగళవారం ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు వాహనాలను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ సిమెంట్ కర్మాగారంలో కొంత కాలం క్రితం ప్రపంచ సిమెంట్ దిగ్గజం 'వికా' మెజారిటీ వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News