: నా భార్యను వేధిస్తున్నాడు: చర్లపల్లి జైలు వార్డర్ పై ఖైదీ ఫిర్యాదు


తన భార్యను వార్డర్ వెంకన్న వేధిస్తున్నాడంటూ జైలు ఉన్నతాధికారులకు ఖైదీ రాములు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే... రాములు అనే ఖైదీ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని చూసేందుకు అతని భార్య తరచుగా జైలుకు వచ్చేది. ఈ క్రమంలో ఆమె ఫోన్ నంబర్ ను వార్డర్ వెంకన్న తీసుకుని... తరచుగా ఫోన్ చేసి వేధించేవాడు. ఈమధ్య కాలంలో వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఇదే విషయాన్ని రాములుకు చెప్పింది అతని భార్య. ఈ నేపథ్యంలో వెంకన్న వేధింపులను అతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News