: మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించిన విద్యార్థులు
హైదరాబాద్ లోని మంత్రుల నివాసప్రాంగణాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్శిటీలకు వెంటనే వైస్ ఛాన్సెలర్లను నియమించాలని డిమాండ్ చేశారు. వీసీలు లేకపోవడంతో విశ్వవిద్యాలయాల్లో పరిపాలన అస్తవ్యస్థంగా మారిందని ఆందోళన చేశారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా... ఎలాంటి స్పందన లేకపోవడంతో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మరోవైపు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30న తెలంగాణలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నట్టు విద్యార్థి నేతలు తెలిపారు.