: తెనాలి డాక్టర్ అదృశ్యం విషాదాంతం
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న తెనాలి వైద్యుడు జయచంద్ర అదృశ్యం చివరకు విషాదంగా ముగిసింది. దుగ్గిరాల సమీపంలో బకింగ్ హామ్ కెనాల్ లో జయచంద్ర కారు దొరికిన ప్రదేశానికి 2 కిలోమీటర్ల దూరంలో నీటిలోనే ఆయన మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఈ నెల 18న రాత్రి హైదరాబాద్ నుంచి తెనాలికి బయల్దేరిన జయచంద్రన్... విజయవాడ చేరిన తర్వాత అదృశ్యమైన సంగతి తెలిసిందే. జయచంద్రన్ హైదరాబాదులో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.