: 45 రోజులు... 30 వేల ఎకరాల సేకరణ... సాధ్యమేనా?


నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిపై పూర్తి క్లారిటీ వచ్చింది. రాజధాని కోసం విజయవాడ భవానీ ద్వీపం ఎదురుగా గుంటూరు జిల్లావైపు భూసేకరణ జరపాలని నిర్ణయించారు. మొత్తం 30 వేల ఎకరాల భూమిని 45 రోజుల్లో సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలోని భూసమీకరణ కమిటీ ఈ వివరాలను వెల్లడించింది. భూమి కోల్పోయిన రైతులకు పదేళ్ల పాటు ఎకరాకు ఏడాదికి రూ. 25 వేల చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు... అభివృద్ధి చేసిన తర్వాత భూమిలో 40శాతం రైతులకే ఇస్తారు. 60శాతం భూమిని ప్రభుత్వం ఉంచుకుంటుంది. దీనికి సంబంధించి, ఈనెల 30న కమిటీ మరోసారి సమావేశం కానుంది. చండీగఢ్ మాదిరి సెక్టార్లుగా విభజించి రాజధానిని నిర్మించాలని కమిటీ నిర్ణయించింది. పరిశ్రమలకు రాజధానిలో అనుమతి ఇవ్వరు. నూజివీడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, కర్నూలు ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. గుంటూరు జిల్లాలోనే ఎక్కువ భాగం రాజధాని ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ గుంటూరు జిల్లాలోనే ఎక్కువగా ఉంటాయి. అంతా బాగానే ఉంది కానీ... 45 రోజుల్లో 30 వేల ఎకరాల భూమిని సమీకరించడం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రైతులు పూర్తిగా సహకరిస్తే తప్ప భూ సేకరణ అంత ఈజీ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News