: నేడే ‘మహా’ సీఎం అభ్యర్థి ఎన్నిక


మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేది ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెర పడనుంది. ఈ నెల 15న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ మెజారిటీ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మధ్దతు తప్పనిసరిగా మారింది. బయటి నుంచి బేషరతుగా మద్దతు ప్రకటించేందుకు ఎన్సీపీ ముందుకొచ్చినా బీజేపీ స్పందించలేదు. తన చిరకాల మిత్రపక్షం శివసేన మద్దతు విషయంలో మునుపటిలానే దాగుడుమూతలు ఆడుతున్న నేపథ్యంలో రోజుకో రీతిన మహారాష్ట్ర రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. మరోవైపు మహారాష్ట్ర సీఎం రేసులోకి పలువురు నేతలు వచ్చినా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీసే ముందువరుసలో ఉన్నారు. నేడు ముంబైలో జరగనున్న బీజేపీ శాసనసభాపక్షం భేటీలోనూ ఫడ్నవీస్ నే పార్టీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు సీఎంగా ఎంపికయ్యే నేత, ఈ నెల 31న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News