: కేసీఆర్ ప్రతి అడుగులో '6'


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకాలు చాలా ఎక్కువ అని ఆయన అంతరంగీకులే చెబుతుంటారు. వాస్తు సరిగా లేదని సీఎం క్యాంపు ఆఫీసులో ఆయన అడుగు కూడా పెట్టని సంగతి తెలిసిందే. మరో విషయం ఏమిటంటే, 6 అంకె అంటే ఆయనకు సెంటిమెంట్ ఎక్కువ. ఆయన వాడే వాహనాల నెంబర్లు కూడా 6 అంకెలతోనే ఉంటాయి. చివరకు కేబినెట్ మీటింగ్ లు కూడా 6తోనే ముడిపడి ఉంటాయి. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ 24 (2+4=6)వ తేదీన జరిగింది. ఈ కేబినెట్ సమావేశానికి కేసీఆర్ 6.45 గంటలకు (6+4+5=15..... 1+5=6) హాజరయ్యారు. చాలా సందర్భాల్లో ఆయన 6 మిస్ కాకుండా చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి సెంటిమెంట్ ను ఎవరూ కాదనరు. ఎందుకంటే ఎవరి సెంటిమెంట్లు వారివి మరి. అయితే, ఈ సెంటిమెంట్ పాళ్లు ఎక్కువై ఇతరులకు సమస్య కలిగిస్తేనే ఇబ్బంది!

  • Loading...

More Telugu News