: చట్ట ప్రకారం ముందుకెళ్దాం... వద్దు, మా పరీక్షలు మేం నిర్వహించుకుంటాం: ఏపీ, టీఎస్ మంత్రుల సంవాదం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రుల చర్చలు విఫలమయ్యాయి. విభజన చట్టం మేరకు ముందుకు వెళ్దామని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. దానికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటర్, ఎంసెట్ పరీక్షలను వేర్వేరుగా నిర్వహించుకుంటామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపాదించారు. అలా చేయడం వల్ల ఇరు రాష్ట్రాల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని గంటా తెలిపారు. అలా జరిగే అవకాశం లేదని, 15 శాతం నాన్ లోకల్ రిజర్వేషన్లు అమలు చేస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఆలస్యం కాకూడదని, అడ్మిషన్లు సకాలంలో జరపాలనేది తమ ఉద్దేశమని, అందుకు విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ముందుకు సాగుదామని గంటా సూచించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.