: మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకల్లో టీడీపీ సభ్యత్వ నమోదు
మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించింది. టీడీపీలో క్రియాశీలక కార్యకర్తలకు 2 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించారు. ఆసుపత్రిలో చేరితే 40 వేల వరకు చెల్లించాలని, వైద్య సేవల్లో 15 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు కేశినేని ట్రావెల్స్ లో ప్రయాణిస్తే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.