: హైకోర్టు నోటీసులు అందలేదు... సమ్మె ఆపేది లేదు: జూడాలు
తెలంగాణలో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. హైకోర్టు నుంచి తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండా డీఎంఈ తమతో చర్చలకు రావాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేస్తూ తమతో ఆడుకుంటోందని వారు ఆరోపించారు. చేతనైతే, ప్రభుత్వ వాదనలో పస ఉంటే మీడియా సాక్షిగా బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. గ్రామాల నుంచి తాము ప్రజలను చైతన్యవంతం చేస్తామని, గ్రామాల్లో పని చేయాలనే నిబంధనను రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. తమలో ఒకరిద్దరినే చర్చలకు అనుమతిస్తామంటున్నారని, తామంతా చర్చకు వస్తే ప్రభుత్వానికి నిద్రపట్టదని వారు విమర్శించారు.