: విద్యుత్ పొదుపులో భాగంగా తెలంగాణ సచివాలయంలో ఏసీల తొలగింపు
విద్యుత్ పొదుపు చర్యలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత నానాటికీ తీవ్రమవుతుండడంతో సర్కారు ఆఫీసుల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించింది. దీంతో సచివాలయం నుంచే విద్యుత్ పొదుపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శి స్థాయి అధికారులు మాత్రమే ఏసీ వాడాలని, అనుమతి, అర్హత లేని అధికారులకు ఏసీ కనెక్షన్లు తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో తెలంగాణ సచివాలయంలోని ఏ,సీ,బీ,డీ బ్లాకుల్లో అక్రమంగా వాడుతున్న ఏసీలను అధికారులు తొలగించారు.