: నకిలీ అకౌంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత బండ్ల గణేష్
తన పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఉండడంపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రమేయం లేకుండా తన పేరిట ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, ప్రతిరోజు ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి పోస్టుల్లో కొన్ని వివాదాస్పదంగా ఉన్నాయని ఆయన పోలీసులకు తెలిపారు. తనకు ఫేస్ బుక్ లో అకౌంట్ లేదని, తన పేరిట ఉన్న అకౌంట్ నకిలీదని, దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో, భవిష్యత్ లో ఆ అకౌంట్ ద్వారా చేసిన పోస్టులకు తాను బాధ్యుడను కాదని ఆయన స్పష్టం చేశారు.