: 130 మోడల్ నోకియా 1,649 రూపాయలు
డ్యూయల్ సిమ్ మొబైల్ లో మొదటి లెవెల్ ఫోన్ ను నోకియా మార్కెట్లోకి విడుదల చేసింది. 1.8 అంగుళాల కలర్ డిస్ ప్లేతో బ్లూటూత్, ఆడియో, వీడియో ప్లేయర్లు, యూఎస్ బీ కనెక్టివిటీ, 32 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ వంటి సౌకర్యాలు కలిగిన నోకియా 130 మోడల్ ధరను 1,649 రూపాయలుగా నిర్ణయించింది. బ్యాటరీ బ్యాకప్ అత్యధికంగా ఉంటుందంటూ ఆదరణ చూరగొన్న నోకియా 130 మోడల్ కెమెరా సౌకర్యం లేనప్పటికీ అందరినీ ఆకట్టుకుంటుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.