: సందడి చేసిన కోహ్లీ, అనుష్క జంట
క్రికెట్, బాలీవుడ్ ప్రేమ పక్షులు జంటగా కనువిందు చేశారు. చాలా కాలంగా ప్రేమికులు అంటూ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పూణేలో జంటగా కనిపించారు. పూణేలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ పోటీలను చూసేందుకు కోహ్లీ, అనుష్కాలు జంటగా వచ్చారు. ఐఎస్ఎల్ లో గోవా ఫ్రాంచైజీకి కోహ్లీ సహయజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఎఫ్ సీ గోవా, ఎఫ్ సీ పూణే జట్లు పోటీ పడడంతో జట్టు యజమానులు కోహ్లీ, హృతిక్ రోషన్ మైదానంలో సందడి చేశారు. కోహ్లీ జట్టు పరాజయం పాలవ్వగా, హృతిక్ జట్టు విజయం సాధించింది. దీంతో కోహ్లీ జంట ఆందోళనతో, హృతిక్ రోషన్, అర్జున్ కపూర్ లు ఉత్సాహంగా కనిపించారు.