: ఏపీ, తెలంగాణ విద్యాశాఖ మంత్రుల భేటీ
హైదరాబాదులోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల అధ్యక్షులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు, ఎంసెట్ నిర్వహణ వంటి అంశాలపై మంత్రులు చర్చలు జరుపుతున్నారు.