: బాబు భేష్... కేసీఆర్ ఏం చేస్తున్నావు?: జైపాల్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలస్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఆకట్టుకునేలా పని చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ప్రశంసించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 2వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టినప్పటికీ, అధికార గర్వంతో కేసీఆర్ పని చేయలేదని మండిపడ్డారు. ముందుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఎందుకు విద్యుత్ కొనుగోలు చేయలేదని ఆయన నిలదీశారు. పదవులు ఉంటాయి, పోతాయి, మనం చేసే పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని ఆయన అన్నారు. బాబు పదవి చేపట్టగానే ముందు చూపుతో విద్యుత్ ను కొనుగోలు చేసి, రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేసుకున్నారని ఆయన కితాబిచ్చారు. విభజన బిల్లులో తెలంగాణకు ఎక్కువ విద్యుత్ కేటాయించినా, కేసీఆర్ విద్యుత్ సమస్య లేకుండా చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు.