: మోక్షం కోసం ఆమరణ దీక్ష చేస్తున్న వృద్ధులు
మోక్షంలో చోటు కోసం మహిళలు నిరాహారులుగా ధ్యానం చేస్తున్నారు. ఒడిశాలోని కటక్ లో '83 విక్కీ దేవి సేథీ' జైన మత సంప్రదాయం ప్రకారం మోక్షం కోసం ధ్యానంలో గడుపుతున్నారు. ఇందుకోసం తమ కుటుంబ సభ్యులు, మత పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అలాగే జైపూర్ లోని 60 ఏళ్ల విమలాదేవి భన్సాల్, 93 ఏళ్ల కాలియా దేవి గత 24 రోజులుగా నిరాహారులుగా ధ్యానంలో ఉన్నారు. విమాలాదేవి భన్సాల్ కు బ్రెయిన్ ట్యూమర్ ఉండగా, కాలియా దేవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. వీరి దీక్ష చట్టవిరుద్ధమని, దీనిపై చర్యలు తీసుకోవాలని 'స్ట్రగుల్ ఫర్ జస్టిస్' అనే స్వచ్ఛంద సంస్థ ఒడిశా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. రాజ్యాంగంలోని 21వ అధికరణం, ఐపీసీ 306, 309 సెక్షన్ల ప్రకారం నిరాహార దీక్షలు శిక్షార్హమైన నేరమని వారు పేర్కొన్నారు.