: డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏపీలో నేటి నుంచే ఇసుక విక్రయాలు
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక విధానంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష ముగిసింది. డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక విక్రయాలు ఈరోజు నుంచే ప్రారంభించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, కేంద్రీకృత విధానం ద్వారా ఇసుక అమ్మకాలు జరపాలని, గ్రామ సమాఖ్య పర్యవేక్షణలోనే అమ్మకాలు ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో ఒక్కో సమాఖ్యకు రూ.5 లక్షల బ్యాంకు రుణం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.