: కేసీఆర్ తో కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ తో కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ కృష్ణ పండిట్ సమావేశమయ్యారు. మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం, సాగర్ జల విద్యుదుత్పత్తిపై తలెత్తిన వివాదాలు, బోర్డుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలు గురించి చర్చిస్తున్నారు. ఇంకా తెలంగాణకు 54 శాతం విద్యుత్తు కేటాయించడం పైనా, గతంలో ఇచ్చిన జీవోలు, వాటి అమలు అంశంపైన కీలక చర్చ జరుగుతోంది.