: జూడాలు సమ్మె విరమించుకోవాల్సిందే: హైకోర్టు


డిమాండ్ల సాధనకోసం గత కొన్ని రోజులుగా జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మెను విరమించుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మె విరమించకపోతే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని తేల్చిచెప్పింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు, జూడాలకు సమ్మె చేసే హక్కు లేదని చెప్పింది. సమ్మె చేయడానికి మీరేమీ దినసరి కార్మికులు కాదని సూచించింది. బాధ్యత గల పౌరులు చట్టాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకున్నారని అడిగిన న్యాయస్థానం... పారిశ్రామిక, దుకాణాల చట్టం జూనియర్ వైద్యులకు వర్తించదని పేర్కొంది. అనంతర విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News