: ప్రధాని కార్యాలయంలో నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?


భారత్ లో సగటు నెట్ స్పీడు 2ఎంబీపీఎస్ (సెకనుకు రెండు మెగాబైట్లు). అదే, ప్రధానమంత్రి కార్యాలయంలో అయితే 34 ఎంబీపీఎస్. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఆన్ లైన్ ఆర్టీఐ.కామ్ సహ వ్యవస్థాపకుడు వినోద్ రంగనాథన్ పంపిన దరఖాస్తుకు బదులిస్తూ పీఎంవో ఈ వివరాలు తెలిపింది. ప్రధాని కార్యాలయానికి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సగటున 34 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోందని పీఎంవో పేర్కొంది. దీనిపై, రంగనాథన్ మాట్లాడుతూ, ప్రధానికి అధిక నెట్ స్పీడు ఉండడంలో తప్పులేదని, ఓ ప్రధానమంత్రిగా ఆయనకు మెరుగైన కనెక్టివిటీ ఉండాల్సిందేనని అన్నారు. అమెరికాలోని వినియోగదారులకు గూగుల్ ఫైబర్ 1 జీబీపీఎస్ (సెకనుకు ఓ గిగాబైట్) అందిస్తోందని ఆయన తెలిపారు. కొచ్చిలోని స్టార్టప్ విలేజ్ (టెక్నోపార్క్) లోనూ 1 జీబీపీఎస్ అందిస్తున్నారని, ఆ స్పీడు ప్రధాని కార్యాలయంలో నెట్ స్పీడుకు 30 రెట్లు అధికమని అన్నారు.

  • Loading...

More Telugu News