: ఎలా పరిపాలించాలో పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోండి: ఎర్రబెల్లి
తెలంగాణలో ప్రభుత్వ పాలన గందరగోళంగా తయారైందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. పరిపాలించడం చేతకాకపోతే... ఎలా పాలించాలో పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు దరఖాస్తు చేసుకుంటే... మళ్లీ సర్వే అంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. కృష్ణపట్నం విద్యుత్ విషయంలో హిందుజాను చంద్రబాబు బెదిరించారంటూ కేసీఆర్ ఆరోపించారని... మరి తమరు 'ఆమ్యామ్యా'లు అడిగిన సంగతి గురించి మాట్లాడరేమని కేసీఆర్ ను ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.