: రాజీవ్ హత్య కేసులో నళిని పిటిషన్ తిరస్కరణ
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న నళిని అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఇన్నాళ్లు శిక్ష అనుభవించిన తనను ముందుగా విడుదల చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. రాజీవ్ కేసులో మరో ఆరుగురితో పాటు నళిని ప్రస్తుతం వేలూరు సెంట్రల్ జైల్లో ఉంటోంది. ఆమెకు విధించిన మరణశిక్షను సుప్రీం జీవిత ఖైదుగా మార్చింది. ఈ క్రమంలో 'క్రిమినల్ ప్రొసిజర్ చట్టం'ను అనుసరించి నిర్దేశించిన కాలానికి ముందే నిందితులను విడుదల చేయాలనుకుంటున్నట్లు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో స్టే విధించింది.