: బ్రెజిల్ అధ్యక్షురాలికి మోదీ శుభాభినందనలు
రెండో పర్యాయం బ్రెజిల్ అధ్యక్షురాలిగా ఎన్నికైన దిల్మా రౌసెఫ్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "బ్రెజిల్ అధ్యక్షురాలిగా మరోసారి ఎన్నికైనందుకు దిల్మాకు అభినందనలు. రెండో పర్యాయం బాధ్యతలు చేపడతున్న నేపథ్యంలో నా శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దిల్మాతో కలిసి భారత్-బ్రెజిల్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.