: నల్ల కుబేరుల జాబితాలో నలుగురు కాంగ్రెస్ నేతలు?
స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపాదనను దాచుకున్న భారతీయ కుబేరుల జాబితాలో నలుగురు కాంగ్రెస్ నేతలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నలుగురిలో ఓ వ్యక్తి మన్మోహన్ సింగ్ కేబినెట్ లో జూనియర్ మంత్రిగా పనిచేశారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగిలిన ముగ్గురిలో మహారాష్ట్ర కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులుండగా, ఉత్తర ప్రదేశ్ కు చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒకరు ఉన్నట్టు సమాచారం. రాజకీయాలతో సంబంధం లేని ముగ్గురు నల్ల కుబేరుల పేర్లను సోమవారం వెల్లడించిన కేంద్రం, తాజాగా ఈ తరహా ప్రచారానికి తెరతీసిందని తెలుస్తోంది. ఈ నలుగురికి ఆదాయపన్ను శాఖ త్వరలో నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది.