: 28 ఏళ్ళనాటి పీటీ ఉష రికార్డును బద్దలు కొట్టిన పారా స్విమ్మర్


ఇంచియాన్ లో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత్ స్విమ్మర్ శరత్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఓ మల్టీ కాంపిటీషన్ ఈవెంట్ లో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయుడిగా అవతరించాడు. ఇంచియాన్ క్రీడల్లో శరత్ 6 పతకాలు సాధించి, పీటీ ఉష (1986 ఆసియా క్రీడల్లో 5 పతకాలు) రికార్డును బద్దలు కొట్టాడు. తొలుత 200మీ వ్యక్తిగత మెడ్లీలో రజతం నెగ్గిన శరత్, 100మీ బటర్ ఫ్లయ్, 100మీ బ్రెస్ట్ స్ట్రోక్, 100మీ బ్యాక్ స్ట్రోక్, 50 మీ ఫ్రీస్టయిల్ అంశాల్లో కాంస్య పతకాలు సాధించాడు. అనంతరం, ప్రశాంత్ కర్మాకర్, స్వప్నిల్ పాటిల్, నిరంజన్ ముకుందన్ లతో కలిసి 4X100 మెడ్లీ రిలే అంశంలో కాంస్యం నెగ్గాడు. తన ప్రదర్శనపై శరత్ మాట్లాడుతూ, ఎంతో సంతోషంగా ఉందని, ఆర్నెల్లుగా కఠోరంగా శ్రమించానని తెలిపాడు. ఒలింపిక్స్ గానీ, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల వంటి భారీ ఈవెంట్లు ముగిసిన వెంటనే, వికలాంగులకు పోటీలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ పోటీలను పారా ఒలింపిక్స్, పారా ఏషియాడ్ గా పిలుస్తారు.

  • Loading...

More Telugu News