: దుండగుల కాల్పుల్లో దక్షిణాఫ్రికా సాకర్ టీం కెప్టెన్ మృతి
దక్షిణాఫ్రికా జాతీయ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సెంజో మెయివా దుండగుల కాల్పుల్లో మరణించాడు. జోహాన్నెస్ బర్గ్ సమీపంలోని వోస్లూరస్ టౌన్ షిప్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మెయివా తన నివాసంలో ఉండగా, ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరబడి కాల్పులు జరిపారు. మరో వ్యక్తి బయట ఉన్నాడు. అనంతరం వారు పరారయ్యారు. కాగా, దాడి సమయంలో మెయివా నివాసంలో ఏడుగురు వ్యక్తులు ఉన్నారని, కాల్పులకు ముందు వాగ్వివాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దుండగుల ఆచూకీ తెలిపిన వారికి రూ.8.50 లక్షల భారీ నజరానా ప్రకటించారు. మెయివా మృతిపై స్థానిక ఓర్లాండో పైరేట్స్ సాకర్ క్లబ్ చైర్మన్ ఇర్విన్ ఖోజా సంతాపం తెలిపారు. అతను నెంబర్ వన్ గోల్ కీపర్ అని పేర్కొన్నారు.