: ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన ల్యాప్ టాప్ లను ఆన్ లైన్లో అమ్ముకుంటున్నారు!


ఉత్తరప్రదేశ్ లో విద్యా ప్రమాణాలను పెంచేందుకని విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే, అలా విద్యార్థులకు అందిన ల్యాప్ టాప్ లు చేతులు మారుతున్నాయి. వాటిని ఆన్ లైన్లో అమ్మకానికి పెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మొరాదాబాద్ లోని ముండా పాండే ఇంటర్ కళాశాల మ్యాథ్స్ లెక్చరర్ ఈ ఫ్రీ ల్యాప్ టాప్ ను రూ.14,000 కు అమ్మిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారిస్తే, ఆ ల్యాప్ టాప్ ను అతగాడు ఓ విద్యార్థిని తండ్రి నుంచి చవకగా కొని, ఆన్ లైన్లో అమ్మేసినట్టు తేలింది. దీనిపై జిల్లా పాఠశాలల ఇన్ స్పెక్టర్ శర్వాన్ కుమార్ స్పందిస్తూ, సదరు లెక్చరర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News