: ప్రధాని అభినందనలు...సానియా కృతజ్ఞతలు
డబ్ల్యూటీఏ మహిళల డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆమెను ప్రశంసించారు. "డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో విజయం సాధించినందుకు సానియా మీర్జాకు అభినందనలు. మరో గెలుపు దక్కించుకున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది" అని పీఎం పోస్టు చేశారు. అందుకు వెంటనే సానియా కూడా ట్విట్టర్ లో స్పందించి మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. 'మీ శుభాకాంక్షలకు చాలా గర్వపడుతున్నా'నని పేర్కొంది.